బేగంపేట ఆసుపత్రిలో అగ్నిమాపక మాక్ డ్రిల్

78చూసినవారు
బేగంపేటలోని ఓ ఆసుపత్రిలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ అగ్నిమాపక అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు స్పందించే తీరుపై ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించారు. మంటలు చెలరేగిన సందర్భంలో రోగులను ఎలా రక్షించాలో, అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఎలా వినియోగించాలో ఫైర్ అధికారులు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్