హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని ఆకాంక్షించారు.