
రుతుపవనాల కదలికలో ఆలస్యం
AP: నైరుతి రుతుపవనాల కదలిక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. శనివారం నుంచి రుతుపవనాల్లో కదలిక వచ్చి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. మరో 3 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక రావొచ్చని అంచనా. అప్పటివరకూ ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.