
67 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’: CBN
AP: ‘తల్లికి వందనం’ పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుందని చెప్పారు. గతంలో ‘అమ్మఒడి’కి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని అన్నారు. అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే.. ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.