
ప్రభుత్వ పాఠశాలలో బాలికపై ముగ్గురు టీచర్లు అత్యాచారం!
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను స్కూల్ బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. కడుపు నొప్పి కారణంగా బాలిక పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతి అని తేలింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు టీచర్లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.