బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని పద్మారావు నగర్ పార్కులో జిహెచ్ఎంసి సిబ్బందిని వాకర్స్ నిలదీశారు. పార్కును శుభ్రం చేయట్లేదని. ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి నిత్యం తామే శుభ్రం చేసుకుంటున్నామని వాపోయారు. ఫోటోలు దిగడానికి వచ్చారా అని అధికారులు, సిబ్బందిని నిలదీశారు. పార్క్ అపరిశుభ్రంగా ఉండటంతో తాము ఇబ్బంది పడుతున్నామన్నారు. మాట్లాడే విధానం ఇది కాదని జిహెచ్ఎంసి సిబ్బంది సూచించారు.