సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఈ నెల 13, 14న జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఫలహారం బండ్ల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. పోలీసు నిబంధనలు తప్పకుండా పాటించి జాతర సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, సీఐలు, పోలీసు సిబ్బంది, ఫలహారం బండ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.