
పాక్తో కాల్పుల విరమణకు గడువు లేదు: భారత ఆర్మీ
భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్తో కాల్పుల విరమణకు గడువు లేదని పేర్కొంది. ఈ నెల 12న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహన కొనసాగుతుందని వెల్లడించింది. ఆ రోజు జరిగిన డీజీఎంవో చర్చల్లోని నిర్ణయాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ రోజుతో కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఆదివారం ఎలాంటి డీజీఎంవో స్థాయి చర్చలు జరగవని పేర్కొంది.