సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల నిధులు విడుదల చేయాలి

71చూసినవారు
సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల నిధులు విడుదల చేయాలి
సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని గురువారం లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్