కంటోన్మెంట్ జయనగర్ కాలనీలో ని శ్రీ శివ సాయిరాం దేవాలయం 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ, గణపతి పూజ, అఖండ దీపారాధన, గణపతి అభిషేకం రుద్రాభిషేకం, సుదర్శన హోమం మహాలక్ష్మి హోమం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజల కు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.