బోనాల జాతర ప్రశాంతంగా జరుపుకోవాలి: జంపన ప్రతాప్

58చూసినవారు
బోనాల జాతర ప్రశాంతంగా జరుపుకోవాలి: జంపన ప్రతాప్
ఈ నెల నాలుగవ తేదీన జరగనున్న ఆషాడ మాస బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సూచించారు. మూడవ వార్డు ఈద్ఘా అంబెడ్కర్ నగర్ శీతల పోచమ్మ ఆలయం. బాలం రాయి దండు మారెమ్మ ఆలయాలను గురువారం సందర్శించి అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సబ్యులకు జాతర నిర్వహించేందుకు తన వంతుగా కొంత నగదు అందజేశారు. కమిటీ సభ్యులు జాతరలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్