
ప్రతి జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయం: మన్నవ మోహనకృష్ణ
AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) కార్యాలయాలను ప్రారంభించబోతున్నట్లు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. జిల్లా స్థాయిలో ఐటీ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆధార్ ఆధారిత సేవలు, ప్రొక్యూర్మెంట్, డిజిటల్ సంతకాల ధ్రువీకరణ, సైబర్ సెక్యూరిటీ వంటి 8 కీలక సాంకేతిక సేవలను సంస్థ ద్వారా అందించనున్నారు.