చిలకలగూడ: గాంధీ ఆసుపత్రి వద్ద డెడ్ బాడీ కలకలం

52చూసినవారు
చిలకలగూడ: గాంధీ ఆసుపత్రి వద్ద డెడ్ బాడీ కలకలం
చిలకలగూడ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపింది. గాంధీ ఆసుపత్రి ఆవరణలో కింద పడి ఉన్న దాదాపు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది చూసి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో పోలీసులు మార్చురికి తరలించి భద్రపరిచారు. ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టిన వారు పీఎస్లో తెలపాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్