తార్నాక చౌరస్తా వద్ద ఉన్న డెక్కన్ ఫామ్ రెస్టారెంట్ లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సోమవారం తనిఖీలు చేశారు. పాత ఆన్ హైజనిక్ ఆహార పదార్థాలు గుర్తించి రెస్టారెంట్ రెస్టారెంట్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడిన డిప్యూటీ మేయర్ రెస్టారెంట్ ను వెంటనే తనిఖీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.