హైదరాబాద్ నగర వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరుతున్నాయి. బేగంపేట్ ఫ్లై ఓవర్ ( ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ ) ప్రారంభ స్థానం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రద్దీని నివారించడానికి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని ట్రాపిక్ పోలీసులు సూచిస్తున్నారు. బేగంపేట్, పంజాగుట్ట పోలీసులు ట్రాపిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు.