మహంకాళి పీఎస్ పరిధిలో దుకాణాల షట్టర్లు ఎత్తి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల గల ముఠాను పోలీసులు చాకచక్యంగా సోమవారం పట్టుకున్నారు. మహాంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నార్త్ ఇండియాకు చెందిన ముగ్గురు ఓల్డ్ బోయిగూడలోని ఓ దుకాణంలో గతనెల 31న షట్టర్ పైకి ఎత్తి దోపిడికి పాల్పడ్డారు. వీరినుంచి రూ. 28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.