సివిల్ సర్వీసెస్-2026 పరీక్షలకు జులై 25 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు 150 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జులై 8 వరకు https://tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన వారికి వసతి, నెలకు రూ.5వేల స్టైపెండ్ ఇస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 040-24071178 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.