పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన తాజాగా కలకలం రేపింది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ ఆమె ఇంటికి వెళ్లి కత్తితో బెదిరింపులకు దిగాడు ఓ యువకుడు. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వేధింపులను మౌనంగా భరించకండని, సోషల్ మీడియాలో కానీ, నేరుగా గానీ ఎవరైనా మిమ్మల్ని వేధింపులకు గురిచేసినా, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.