అనారోగ్యంతో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ పండరి కథనం ప్రకారం. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ గ్రామానికి చెందిన డి. మారుతి (33) కూలీ పనులు చేస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో కుడి కాలు, చేయి పనిచేయడం లేదు. మనస్థపానికి గురి అయ్యి బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.