మల్లాపూర్ ఈసీఐఎల్ మార్గంలోని ఎన్ఎఫ్సీ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు రాచకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన రాచకొండ పోలీసులు వెంటనే ఎక్స్ వేదికగా కుషాయిగూడ పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాద ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.