సితాఫలమండీ సెట్విన్ కేంద్రం సందర్శన: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

60చూసినవారు
సితాఫలమండీ సెట్విన్ కేంద్రం సందర్శన: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సితాఫలమండీ సెట్విన్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం సెట్విన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి జోగు రమేష్ నేతృత్వంలోని ఓ బృందం సందర్శించింది. సెట్విన్ కేంద్రం కార్యకలాపాలను జోగు రమేష్ ఈ సందర్భంగా ప్రశంసించారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన పద్మారావు గౌడ్ ను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్