సికింద్రాబాద్లో శనివారం జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మారావు పాల్గొని రూ. 2. 53 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా తులం బంగారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారాయన్నారు.