హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు పూర్తి కావడం, చర్లపల్లి టర్మినల్ సిద్ధం కావడంతో కేంద్రం యాదాద్రి రైల్వే లైన్ పై దృష్టి సారించింది. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులో వస్తే సికింద్రాబాద్ నుంచి 45 నిమిషాల్లో కేవలం 20 రూపాయలకే చేరుకోవచ్చు.