క్షుద్ర పూజలు చేసిన వైసీపీ నేతలు అరెస్ట్
ఏపీలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్లు సమాచారం. పోలీసులు వీరిని రహస్యంగా విచారిస్తున్నారు. అయితే గుప్త నిధుల కోసమే క్షుద్ర పూజలు చేశారా? లేదంటే ఎవరి నాశనమైన కోరుతూ చేశారా? అని పలువురు అనుమానిస్తున్నారు.