

జగన్ పాలనపై కొలికపూడి పాట (వీడియో)
AP: జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చతికిలపడిన చదువుల తీరును శాసనసభలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాట రూపంలో వినిపించారు. జగన్ పార్టీకి 11 ఎమ్మెల్యే సీట్లు ఎలా వచ్చాయని 9 నెలలుగా చాలా మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారని.. దానికి సమాధానం సభ్యులకు ఇచ్చిన బుక్లెట్లో 3వ పేజీలో ఉందని చెబుతూ ఆయన పాట పాడారు. రాష్ట్రంలో ఉన్న 3,13,112 మంది ఉపాధ్యాయుల సంఖ్యను కూడితే 11 వచ్చిందన్నారు.