బుధవారం మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాయల్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ లైన్, నాలాపై స్లాబ్ పనులను త్వరగా పూర్తిచేసేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. పెండింగ్ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తామని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.