సికింద్రాబాద్ పరిధి జనరల్ బజార్ లోని రంగారాజ్ జజార్, కుర్మ బస్తీ మరియు మల్లికార్జున అపార్ట్మెంట్ ఏరియాలో శనివారం విద్యుత్తు అంతరాయం ఉంటుందని సిబిడి ఎడిఈ అది నారాయణ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యుత్ తీగల పైన ఉన్న చెట్ల కొమ్మలను తీసివేయుటకు మరియు విద్యుత్ లైన్ల మరమ్మత్తులు కారణంగా మధ్యాహ్నం 2 గం.ల నుండి 3 గం.ల వరకు 11 కెవి ఆంజలీ ఫీడర్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉండనుంది.