ఎమ్మెల్యేని కలిసిన వివేకానందనగర్ బస్తీ వాసులు

77చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన వివేకానందనగర్ బస్తీ వాసులు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ని క్యాంపు కార్యాలయంలో వివేకానందనగర్ బస్తీ వాసులు బుధవారం కలిశారు. తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ, సీవరేజీ, రోడ్డు సమస్యలు ఉన్నాయని, ఇళ్ల పట్టాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని, ఇళ్ల పట్టాల విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని శ్రీ గణేశ్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్