ప్రముఖ సినీనటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్బండ్ కు వచ్చారు. తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రీతి జింటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆలయానికి ఆమె రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రీతి జింటా స్వామి వారిని దర్శించుకున్నారు.