

జనసేన నేత లీలలు.. మహిళ ఆత్మహత్యాయత్నం (వీడియో)
AP: తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళ దగ్గర కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేశారు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి సూసైడ్‌కు పాల్పడ్డారు. తిరుపతికి చెందిన ఓ మహిళకు కిరణ్ రాయల్‌తో సన్నిహిత సంబంధం ఉంది. మహిళ అనేక దఫాలుగా రూ.1.20 కోట్ల వరకు అప్పుడు ఇచ్చారు. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మహిళ వేలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.