సికింద్రాబాద్: వర్గీకరణను వెంటనే అమలు చేయాలి

81చూసినవారు
సికింద్రాబాద్: వర్గీకరణను వెంటనే అమలు చేయాలి
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు, దరువు ఎల్లన్న డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7న నిర్వహించనున్న వేల గొంతులు, లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరుతూ తార్నాక డివిజన్ మాదిగ సంఘాల నాయకులు సోమవారం లాలాపేటలో డప్పుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లాలాపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్