ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. డీజే సాయి టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చల్లటి పానీయాలను ర్యాలీలో పాల్గొన్న భక్తులకు పంపిణీ చేశారు. డీజే సాయి టీం సభ్యులను కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు.