వాస్కోడిగామా రైల్లో వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వికారాబాద్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వరకు తనిఖీల్లో రూ. 90 వేల విలువ గల మొత్తం 45 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి గోవా నుంచి హైదరాబాద్కు మద్యం సరఫరా అవుతున్నట్లుగా గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే శనివారం మద్యం బాటిళ్లు పట్టుకొని, సీజ్ చేశారు.