కంటోన్మెంట్ పరిధిలోని డిఫెన్స్ మరియు సివిల్ ఏవియేషన్ లాండ్స్ లో నివాసం ఉంటున్న దాదాపు 10వేల కుటుంబాలకు పట్టాల మంజూరుకు సంబంధించి బోర్డు సీఈవో మధుకర్ నాయక్, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ దినేష్ కుమార్ రెడ్డి లతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పుడు తాజాగా బోర్డు సిఈవో మరియు డిఈవో తో కూడా చర్చలు జరిపారు. ఎమ్మెల్యే ప్రతిపాదన పట్ల వారు సానుకూలంగా స్పందించారని, దీంతో భూ బదలాయింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.