ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని బుధవారం విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. సమావేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తిరోగమన నిర్ణయాల వలన ఉన్నత విద్య పేదలకు దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల్లో దీనిపై లోతుగా చర్చిస్తామని చెప్పారు.