

టెక్సాస్‌లో భీకర వరదలు.. 43కి చేరిన మృతుల సంఖ్య
టెక్సాస్‌లో భీకర వరదలు ఇప్పటివరకు 43 మందిని బలితీసుకున్నాయి. మృతుల్లో 15 మంది పిల్లలే. గ్వాడలూప్ నదీ పరివాహక ప్రాంతంలోని మిస్టిక్ కాంప్లోని వేసవి శిబిరం నుంచి 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వరద నీటిలో ఇరుక్కున్న 850 మందికి పైగా ప్రజలను అత్యవసర బృందాలు రక్షించాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో పలు ఇళ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.