సికింద్రాబాద్: ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి

62చూసినవారు
సికింద్రాబాద్: ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి
మహాత్మా జ్యోతి రావ్ ఫూలే విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ యునైటెడ్ పులే ఫ్రంట్, తెలంగాణా జాగృతి సంస్థలు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్కు వినతి పత్రాన్ని అందించాయి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పక్షాన వినతి పత్రాన్ని వివిధ సంఘాల నేతలు బోళ్ల శివశంకర్, అలకుంట హరి, సంపత్ కుమార్, నరేశ్, గోపు సదానంద్, ప్రవీణ్ అందజేశారు.

సంబంధిత పోస్ట్