సికింద్రాబాద్: గుర్తు తెలియని వ్యక్తి మృతి

52చూసినవారు
సికింద్రాబాద్: గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఉప్పల్ డిపో ఎదురుగా గల మెట్రో ఫుట్ వేర్ వద్ద పడి ఉండగా వెంటనే అతడిని108 అంబులెన్సు ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, సిఐ గోవింద రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్