బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని రోషిణి గురువారం తెలంగాణ భవన్ కు ఒంటరిగా వెళ్ళింది. నేరుగా కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లి ఆయనతో ముచ్చటించింది. ఎవరెవరు వచ్చారని కేటీఆర్ అడగగా ఒంటరిగా వచ్చానని చెప్పడంతో కేటీఆర్ అవక్కై బాలికను హత్తుకున్నారు. చదువు, నివాసం, తల్లిదండ్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమే ధైర్యానికి మెచ్చుకుని బాలికకు జ్ఞాపికను బహుకరించారు.