తార్నాక జలమండలి విభాగానికి నూతన డిప్యూటి జనరల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన నజ్రీన్ జీహెచ్ఎంసీ డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ నూతన డిప్యూటి జనరల్ మేనేజర్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనితీరు కనబరచాలని డిప్యూటి మేయర్, జనరల్ మేనేజర్ కు సూచించారు.