సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బరంపురం వెళ్లే రైలు రీ షెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు ఆందోళనల బాటపట్టారు. రాత్రి 8: 15 గంటలకు వెళ్లాల్సిన రైలును శనివారం ఉదయం రీ షెడ్యూల్ చేయడం ఏంటని, తాము రాత్రంతా ఎక్కడ ఉండాలి.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కారణాలతో గత కొద్ది రోజులుగా రైళ్ల రీ షెడ్యూల్ జరుగుతుండగా, బుకింగ్ ఆఫీస్ షెడ్డులోనే ప్రయాణికులు రాత్రి పడిగాపులు కాస్తున్నారు.