మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

75చూసినవారు
మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని హఫీజ్ పేట్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ లో శనివారం దుండగులు సిమెంట్ ఇటుకలతో తలపై మోది హత్య చేసినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్