నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. నాగర్ కర్నూల్ ఎంపీగా 4 సార్లు పని చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరపున నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు.