కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. భూముల వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్డు ఈ కేసును సుమోటో స్వీకరించి భూమి చదును చేసే పనులపై స్టే విధించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయ వివాదం వల్ల ఏళ్ల తరబడి ఆ స్థలం ఖాళీగా ఉందని, దీంతో అక్కడ ఏపుగా చెట్లు పెరిగాయని, అది అడవి కాదని పేర్కొంది.