శేరిలింగంపల్లిలో భారీ వర్షం

77చూసినవారు
రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గల మియాపూర్, మదీనాగూడ, దీప్తిశ్రీ నగర్, చందానగర్, లింగంపల్లి, అశోక్ నగర్, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్