హైదరాబాద్: ఏ రాష్ట్రంలో బీజేపీ కులగణన చేయలేదు: మంత్రి ఉత్తమ్

64చూసినవారు
హైదరాబాద్: ఏ రాష్ట్రంలో బీజేపీ కులగణన చేయలేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ చరిత్రలో ఇది చారిత్రాత్మక రోజు అని మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణన విషయంలో క్రెడిట్ అంతా సీఎం రేవంత్, భట్టి విక్రమార్కకు ఇవ్వాలని అన్నారు. 'మేము చేసిన సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతాం. అన్ని సంక్షేమ పథకాలకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఏ రాష్ట్రంలో బీజేపీ కులగణన చేయలేదు. బీసీ జనాభా తగ్గిందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది' అని చిట్‌చాట్‌లో మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్