పంచాయతీ ఎన్నికలపై మంగళవారం రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు బుధవారం నుంచి హైదరాబాద్‌లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. కాగా, ఈ నెల 15 లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.