హైదరాబాద్ పిర్జాదీ గూడాలోని ఉప్పల్ భగాయత్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతలో పడి ఈత రాక ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు అర్జున్ (8) మణికంఠ (15)గా గుర్తించారు. మృతుల తల్లిదండ్రులు ఫైఓవర్ నిర్మాణ పనుల కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.