మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్నారు మాజీ సీఎం. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులు ఉన్నారు. నిన్ననే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న గులాబీ బాస్ శనివారం మరోసారి ఆస్పత్రికి వెళ్లారు.