ఓటమి కూడా మనకు మంచిదే. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది. చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఆడ బిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్గం పక్కా చేస్తారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ లో వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.